justice: రాజకీయ పార్టీని ప్రారంభించనున్న జస్టిస్ కర్ణన్

  • యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ
  • వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పోటీ చేస్తామన్న కర్ణన్
  • దేశం నుంచి అవినీతిని పారద్రోలడమే పార్టీ సిద్ధాంతం
కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ సంచలన విషయాన్ని ప్రకటించారు. 'యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ' పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. అయితే, కేవలం మహిళలను మాత్రమే బరిలోకి దింపుతామని తెలిపారు.

దేశం నుంచి అవినీతిని పారద్రోలడమే తమ పార్టీ సిద్ధాంతమని చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలవనున్నట్టు తెలిపారు. కలకత్తా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై ఆయనకు 6 నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు విధించిన సంగతి తెలిసిందే.
justice
karnan
political party
anti curroption dynamic party

More Telugu News