everest: ఎవరెస్ట్ శిఖరంపై కాలుమోపిన ఐదుగురు ఏపీ విద్యార్థులు

  • ఎవరెస్ట్ ను అధిరోహించిన ఏపీ విద్యార్థులు
  • రెండేళ్లుగా పర్వతారోహణలో శిక్షణ
  • అభినందించిన ప్రభుత్వ యంత్రాంగం
ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. విశాఖపట్టణం జిల్లా గోలుగొండకు చెందిన జి.రాజు, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలకు చెందిన ప్రసన్న, కొత్తూరుకు చెందిన భానుసూర్యప్రకాష్, పశ్చిమగోదావరి జిల్లా పెదవేగికి చెందిన ప్రవీణ్, నెల్లూరు జిల్లా చిట్టేడు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే విద్యార్థులు ఈ ఘనతను సాధించారు. గత రెండేళ్లుగా శిఖరారోహణకు సంబంధించి వీరికి ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఈ విద్యార్థులను ప్రభుత్వ యంత్రాంగం అభినందించింది.
everest
ap
students

More Telugu News