encounter: ఎన్ కౌంటర్ నుంచి మరోసారి తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేత ఆర్కే

  • ఏవోబీ బలిమెల రిజర్వాయర్ సమీపంలో ఎదురు కాల్పులు
  • పలువురు మావోలు గాయపడినట్టు సమాచారం
  • మావోల కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
మరో ఎన్ కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేత ఆర్కే తప్పించుకున్నారు. ఈ ఉదయం ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లోని బలిమెల రిజర్వాయర్ పరిధిలో ఉన్న సిమిలిపొదర్ అటవీ ప్రాంతంలో ఏపీ గ్రేహౌండ్స్ దళాలు, ఒడిశా పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడినట్టు తెలుస్తోంది. అగ్రనేత ఆర్కే తృటిలో తప్పించుకున్నారు. ఘటనా స్థలంలో మావోల కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఎన్ కౌంటర్ కు సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాలను వెల్లడించలేమని పోలీసు అధికారులు చెప్పారు.
encounter
maoist
police
ramakrishna
rk

More Telugu News