Sandlewood: కన్నడ నటి ఐశ్వర్యను పెళ్లి చేసుకోలేదు: మాట మార్చిన నటుడు హుచ్చ వెంకట్

  • ఫేస్ బుక్ లైవ్ లో పెళ్లి గురించి చెప్పిన వెంకట్
  • ఆపై మాటమార్చిన కన్నడ నటుడు
  • అది సినిమా పెళ్లని వెల్లడి
మూడు రోజుల క్రితం ఫేస్ బుక్ లైవ్ లో తాను హీరోయిన్ ఐశ్వర్యను వివాహం చేసుకున్నానని చెప్పి సంచలనం సృష్టించిన కన్నడ నటుడు హుచ్చ వెంకట్, మాట మార్చాడు. తాను ఆమెను పెళ్లి చేసుకోలేదని చెబుతూ, ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం ఐశ్వర్య, హుచ్చ వెంకట్ లు కలసి 'డిక్టేటర్ హుచ్చ వెంకట్' అనే సినిమాలో కలసి నటిస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లి వేడుక దృశ్యాలు ప్రత్యక్షం కాగా, అవి సినిమా కోసం తీసిన పెళ్లి సీన్ లోని దృశ్యాలని, నిజమైన పెళ్లి దృశ్యాలు కాదని అన్నాడు.
Sandlewood
Facebook
Huchcha Venkat
Marriage
Aishwarya

More Telugu News