dhanush: మాస్ ఆడియన్స్ కోసం ఆటో డ్రైవర్ గా సాయిపల్లవి

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ భాషల్లో సాయిపల్లవికి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కోసం ఆమె చకచకా సినిమాలను అంగీకరించడం లేదు. వైవిధ్యభరితంగా అనిపించి తనకి బాగా నచ్చినవి మాత్రమే ఆమె ఒప్పుకుంటోంది. అలా తమిళంలో ఆమె 'మారి 2' సినిమాలో ధనుష్ జోడీగా నటిస్తోంది. గతంలో ధనుష్ హీరోగా చేసిన 'మారి' సినిమాకి ఇది సీక్వెల్.

 బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సాయిపల్లవి .. ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె పర్ఫెక్ట్ గా ఆటో నడపడం నేర్చుకుందట. ఈ పాత్రతో ఆమె మాస్ ఆడియన్స్ నుంచి మరిన్ని మార్కులు కొట్టేయడం ఖాయమని అంటున్నారు. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు గనుక, ఆటో డ్రైవర్ గా సాయిపల్లవి ఏ స్థాయిలో అదరగొట్టిందో ఇక్కడివాళ్లు కూడా చూడొచ్చు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను చేస్తుండటం విశేషం.    
Go Back to Shorts
dhanush
sai pallavi

More Telugu News