Karnataka: కన్నీరు పెట్టిన సిద్ధరామయ్య.. వారి కోసం అంతా చేస్తే ఓడించారన్న తాజా మాజీ సీఎం

  • కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో సిద్ధూ కన్నీరు
  • పేదలకు అన్నీ చేస్తే ఓడించారని ఆక్రోశం
  • కులాలు, జాతుల అంశానికే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్య
బెంగళూరులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో సిద్ధరామయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ చేసిన కృషిని ఎన్నికల్లో ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను విస్మరించి కేవలం కులాలు, జాతుల అంశాలకే ప్రాధాన్యం ఇచ్చి ప్రజలు తమను ఓడించారని పేర్కొన్నారు. తమ ప్రణాళికలను ప్రజలే మార్చేశారని అన్నారు. విజయంపై ఎంతో ధీమాగా ఉన్నప్పటికీ జనం తమను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Karnataka
siddaramaiah
Congress

More Telugu News