chidambaram: కుమారస్వామిని ఆహ్వానించకపోవడంలో గవర్నర్ ఉద్దేశం ఏమిటి?: చిదంబరం ఫైర్

  • కాంగ్రెస్‌, జేడీఎస్‌లకు పూర్తి మెజార్టీ ఉంది
  • అయినప్పటికీ ఆహ్వానించలేదు 
  • గవర్నర్‌ ఉద్దేశం ఏమిటి?
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నేత యడ్యూరప్పను ఆ రాష్ట్ర గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ఆహ్వానించినట్లు తమకు తెలిసిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అన్నారు. ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... హంగ్‌ ఉన్న సందర్భంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌, జేడీఎస్‌లకు పూర్తి మెజార్టీ ఉందని, అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కుమారస్వామిని గవర్నర్‌ ఆహ్వానించలేదని చిదంబరం అన్నారు. పూర్తి మెజార్టీ ఉన్న కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా ఇతరులను ఆహ్వానించడంలో గవర్నర్‌ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
chidambaram
Congress
Karnataka

More Telugu News