YSRCP: జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న చంద్రబాబు మాజీ సెక్యూరిటీ ఆఫీసర్‌

  • పశ్చిమ గోదావరిలో జగన్‌
  • మాజీ ఐజీ ఇక్బాల్‌ను జగన్‌ వద్దకు తీసుకొచ్చిన వైసీపీ నేతలు
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైసీపీ అధినేత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌వో)గా పనిచేసిన షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌.. ఈ రోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం జగన్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు పలువురు వైసీపీ నేతలు ఇక్బాల్‌ను జగన్‌ వద్దకు తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌కు వైసీపీ కండువా కప్పిన జగన్‌.. ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇక్బాల్‌.. రాయలసీమ ఐజీగా కూడా పనిచేశారు. అంతేగాక, పలు శాఖల్లో కీలక పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కర్నూలు జిల్లాకు చెందిన నేత.  
YSRCP
Jagan
West Godavari District

More Telugu News