Chandrababu: లాంచీ ప్రమాద బాధిత కుటుంబాలను ఓదార్చిన చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
తూర్పుగోదావరి జిల్లాలో లాంచీ మునిగిపోయిన ప్రమాద స్థలికి ముఖ్యమంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మరో లాంచీ ఎక్కి గోదావరిలో ప్రమాద స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబసభ్యులను ఆయన ఓదార్చారు. నిన్న సాయంత్రం వాడపల్లి-మంటూరు మధ్యలో లాంచీ ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. దాదాపు 40 అడుగుల లోతున లాంచీ ఇసుకలో కూరుకుపోయింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మునిగిపోయిన లాంచీని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కొందరి మృత దేహాలను వెలుపలకు తీశారు. 
Go Back to Shorts
Chandrababu
boat
accident

More Telugu News