godavari river: లాంచీని తాళ్లకు కట్టి పైకి లాగేందుకు యత్నిస్తున్నాం: కలెక్టర్ కార్తికేయ మిశ్రా

  • లాంచీ అద్దాలు పగలగొట్టినా లోపలకి వెళ్లడం ఇబ్బందిగా ఉంది
  • లాంచీ తలుపులు తెరవడం సాధ్యం కాలేదు
  • మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది
తూర్పుగోదావరి జిల్లా మంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లి మధ్య గోదావరినదిలో మునిగిపోయిన లాంచీ అరవై అడుగుల లోతులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నీటిలో ఉన్న లాంచీ అద్దాలు పగలగొట్టినా దాని లోపలకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని, లాంచీ తలుపులు తెరిచేందుకు ఎంత యత్నించినా సాధ్యం కాలేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు.

అరవై అడుగుల లోతులో ఇసుకలో కూరుకుపోయిన లాంచీని తాళ్లకు కట్టి పైకి లాగేందుకు సిబ్బంది యత్నిస్తున్నారని చెప్పారు. కాగా, లాంచీ ప్రమాద స్థలంలో మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది సహాయచర్యల్లో పాల్గొన్నారు.
 
godavari river
boat accident

More Telugu News