khushboo: ప్రకటనల్లో కనిపించాలని ప్రధాని మోదీకి కాంక్ష: ఖుష్బూ విమర్శలు

  • ప్రకటనలపై నాలుగేళ్ల కాలంలో రూ.4343 కోట్ల ఖర్చు 
  • కామరాజర్ ప్రతి రూపాయి విద్య కోసం ఖర్చు చేశారు
  • ప్రధాని మోదీ మాత్రం ప్రకటనల కోసం ఖర్చు పెట్టి భారం వేశారు
ప్రధాని నరేంద్ర మోదీపై తమిళనాడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి ఖుష్బూ విమర్శలు సంధించారు. ప్రకటనలపై ప్రధాని మోదీ సర్కారు చేసిన భారీ వ్యయాలు ఆమె విమర్శలకు కేంద్రబిందువు. ప్రధాని మోదీ 2014 మే నుంచి ఈ నాలుగేళ్ల కాలంలో రూ.4343 కోట్లను ప్రకటనలపై ఖర్చు చేసినట్టు ఇటీవలే వెల్లడైన సంగతి గుర్తుండే ఉంటుంది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు కేంద్రమే ఈ వివరాలు తెలిపింది.

దీనిపై ఖష్బూ స్పందించారు. దివంగత కామరాజర్ ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన ప్రతి రూపాయిని విద్య కోసం ఖర్చు చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ప్రధాని మోదీ మాత్రం ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేసి ప్రజలపై భారం మోపారని పేర్కొన్నారు. ఆయనకు టీవీలు, పత్రికల్లో కనిపించాలన్న మోజు ఉందని తెలుస్తోందన్నారు.
khushboo
Prime Minister
Narendra Modi

More Telugu News