karnataka: కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన 12 మంది ఎమ్మెల్యేలు.. కంగుతిన్న పార్టీ పెద్దలు

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ కు 8 సీట్ల దూరంలో ఉన్నా... ప్రభుత్వం తమదే అనే ఆత్మవిశ్వాసంతో బీజేపీ నేతలు ఉన్నారు. ఇదే మాటను యడ్యూరప్ప కూడా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో, కొందరు జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు కూడా జరిపింది.

మరోవైపు జేడీఎస్ కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... బెంగళూరులో తమ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ నుంచి మొత్తం 78 మంది గెలుపొందగా, ఈ సమావేశానికి కేవలం 66 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 12 మంది ఎందుకు హాజరు కాలేదనే అంశంపై హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఈ 12 మందిలో నలుగురు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. ఈ పరిణామాలతో కంగుతిన్న కాంగ్రెస్ నేతలు... ప్రస్తుతం వీరిని వెతికే పనిలో బీజీగా ఉన్నారు.
Go Back to Shorts
karnataka
elections
congress
jds
bjp
mla
missing
meeting

More Telugu News