karnataka: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు జేడీఎస్, కాంగ్రెస్ విలవిల.. సాయంత్రం కొచ్చికి ఎమ్మెల్యేల తరలింపు

  • జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలెం వేస్తున్న బీజేపీ
  • ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు షాంగ్రిలా హోటల్ లో జేడీఎస్, కాంగ్రెస్ ల క్యాంప్
  • బెంగళూరులో క్యాంప్ క్షేమకరం కాదని భావిస్తున్న ఇరు పార్టీలు
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 112 మ్యాజిక్ ఫిగర్ ను సాధించేందుకు బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మల్యేలను లాగేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ కు చెందిన లింగాయత్ సామాజికవర్గ ఎమ్మెల్యేలతో ఇప్పటికే యడ్యూరప్ప సమావేశమయ్యారు. మరోవైపు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ బీజేపీకి మద్దతు పలికినట్టు విశ్వసనీయ సమాచారం.

ఈ నేపథ్యంలో, తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ లు క్యాంపులు ఏర్పాటు చేశాయి. బెంగళూరులోని షాంగ్రిలా హోటల్ లో జేడీఎస్ నిన్న సాయంత్రం నుంచే తన ఎమ్మల్యేలను ఉంచింది. వారిని కలవడానికి కూడా ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు నగరంలో ఉన్న ఈగిల్టన్ రిసార్ట్ లో కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేల కోసం 100 గదులను బుక్ చేసింది.

అయితే, తాజాగా తన క్యాంప్ ను ఈగిల్టన్ నుంచి షాంగ్రిలా హోటల్ కు మార్చింది. ప్రస్తుతం జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఈ హోటల్ లోనే ఉన్నారు. అయితే, బెంగళూరులో తమ ఎమ్మెల్యేలను ఉంచడం క్షేమకరం కాదని భావిస్తున్న ఈ రెండు పార్టీలు... తమ క్యాంప్ ను కేరళలోని కొచ్చికి మార్చబోతున్నాయి. ఈ సాయంత్రం జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొచ్చికి తరలిస్తున్నట్టు సమాచారం.
karnataka
elections
camp
politics
bjp
congress
jds

More Telugu News