karnataka: బెంగళూరు రిసార్ట్ లో 100 గదులను బుక్ చేసిన కాంగ్రెస్

  • ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీని ఇవ్వని కన్నడ ఓటర్లు
  • ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగే పనిలో బీజేపీ
  • ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ ను ఏర్పాటు చేసిన కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా ఆ రాష్ట్ర ఓటర్లు తీర్పును వెలువరించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు రాజకీయాలు వేడెక్కాయి. జంప్ జిలానీల గురించి ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ సీట్లు వచ్చిన బీజేపీ... ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగేందుకు మంతనాలు జరుపుతోంది.

ఇప్పటికే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించడం లేదనే వార్తలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. జేడీఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మీటింగ్ కు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో, తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరదీసింది. బెంగళూరులో ఉన్న ఈగిల్టన్ రిసార్ట్ లో 100 రూములను కాంగ్రెస్ బుక్ చేసినట్టు సమాచారం. రాజ్యసభ ఎన్నికల సమయంలో గుజరాత్ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రిసార్టులోనే ఉంచడం గమనార్హం.
karnataka
elections
bjp
congress
jds
camp
resort
bengaluru

More Telugu News