Karnataka: గవర్నర్ ను కలిసిన యడ్యూరప్ప, పార్టీ నేతలు!

  • బీజేఎల్పీ నేతగా యడ్డీని ఎన్నుకున్నట్టు చెప్పిన నేతలు
  • ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖ అందజేత
  • ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలన్న యడ్యూరప్ప
కర్ణాటక బీజేఎల్పీ నేతగా యడ్యూరప్ప ఎన్నికైన అనంతరం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. యడ్యూరప్పతో పాటు బీజేపీ నేతలు సదానంద గౌడ, జేపీ నడ్డా, జవడేకర్, ఈశ్వరప్ప, ఇతర నేతలు గవర్నర్ ని కలిశారు. యడ్యూరప్పను శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నట్టు గవర్నర్ కు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేశారు. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ ని యడ్యూరప్ప కోరారు.
Karnataka
yeddi

More Telugu News