akhil: రంగంలోకి దిగుతోన్న అఖిల్ .. లండన్లో షూటింగ్

షార్ట్స్‌లో చూడండి
అఖిల్ మూడవ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అఖిల్ రెడీ అయ్యాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో .. విభిన్నమైన ప్రేమకథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో అఖిల్ జోడీగా కైరా అద్వానిని అనుకున్నారు.

ఈ సినిమా మొదటి షెడ్యూలను ఈ నెల 29వ తేదీ నుంచి లండన్ లో ఆరంభించనున్నారు. కథ ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా లండన్ లోనే జరగనుంది. ఇప్పటికే లండన్ లోని లొకేషన్ల వేటను పూర్తి చేసిన టీమ్ .. త్వరలో అక్కడికి వెళ్లనుంది. 'తొలిప్రేమ' సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి యూత్ మనసులను బాగా పట్టేశాడు. అందువలన రొమాంటిక్ లవ్ స్టోరీనే ఆయనతో అఖిల్ చేస్తున్నాడు. ఆయన ఆశించే హిట్ ఈ సినిమాతోనైనా పడుతుందేమో చూడాలి. 
Go Back to Shorts
akhil
kiaraadvani

More Telugu News