డీజే స్నేక్ ఛాలెంజ్ లో సత్తా చాటిన మిల్కీ బ్యూటీ తమన్నా!

షార్ట్స్‌లో చూడండి
ప్యారిస్ కు చెందిన ప్రముఖ డీజే స్నేక్ విసిరిన ఛాలెంజ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నెగ్గింది. ‘మెజెంటా రిడ్డిమ్’ పాటకు తాను చేసిన డ్యాన్స్ ను చేయాలంటూ తమన్నాకు స్నేక్ ఛాలెంజ్ విసిరాడు. ఈ సవాల్ లో తాను నెగ్గినట్టు తమన్నా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా జూయీ వైద్య వ్యవహరించాడని చెప్పిన తమన్నా, తన డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది.

డీజే స్నేక్ ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోకతప్పదని తమన్నా ధీమా వ్యక్తం చేసింది. ఈ వీడియోను లక్ష మందికి పైగా లైక్ చేశారని పేర్కొంది. కాగా, డీజే స్నేక్, తమన్నా లిద్దరూ మంచి స్నేహితులు. తాను నటించిన బాహుబలి చిత్రాన్ని అతనికి చూపించడంతో ఫిదా అయిపోయాడు. భారతీయ సంస్కృతి, డ్యాన్స్ లంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. 

ఇదిలా ఉండగా, ‘మెజెంటా రిడ్డిమ్’ పాటను కంపోజ్ చేసేందుకు డీజే స్నేక్ ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. ఈ పాటకు డ్యాన్స్ చేసిన వారిలో ఎక్కువ మంది భారతీయులు ఉండటం గమనార్హం. 
Go Back to Shorts
dj snake
Tamannaah

More Telugu News