పాతగుంటూరు అత్యాచారం ఘటన.. చంద్రబాబు సీరియస్!
- ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవు
- నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం
- బాధితురాలని, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటాం
కాగా, బాలికపై అత్యాచారానికి యత్నించిన నిందితుడిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. పాతగుంటూరులో గత అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నిందితుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్ పై బాధితురాలి కుటుంబీకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 22 మంది పోలీసులకు గాయాలయ్యాయని, పోలీస్ వాహనాలు ధ్వంసమైనట్టు చెప్పారు. పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేశారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.