Andhra Pradesh: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న కన్నా!

  • ఏపీలో బీజేపీ పగ్గాలు చేపట్టనున్న కన్నా
  • నేరుగా ఢిల్లీ నుంచి విజయవాడ రానున్న నేత
  • ఈరోజు రాత్రి 7 గంటలకు ముహూర్తం
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయన ఈరోజు స్వీకరించనున్నారు. రాత్రి ఏడు గంటలకు నిర్వహించే ఓ కార్యక్రమంలో కన్నా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు విజయవాడ చేరుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వెళతారు.

కాగా, ఢిల్లీలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం ఇటీవల జరిగింది. ఈ సమావేశానికి కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరినీ కలుపుకుపోతానని ఆయన పేర్కొనడం విదితమే.
Andhra Pradesh
bjp
kanna

More Telugu News