Chandrababu: చంద్రబాబు తన వైఫల్యాలను ఇతర పార్టీలపై వేస్తున్నారు!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు తన స్వలాభం కోసం ‘ప్యాకేజ్’ కు ఒప్పుకున్నారు
  • ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నారు
  • బీజేపీతో వైసీపీ జతకట్టిందనే దుష్ప్రచారం తగదు
  • ప్రత్యేకహోదా ఎవరిస్తే వారితో కలిసి పనిచేస్తాం
ఎన్నికల హామీలను నెరవేర్చని చంద్రబాబు తన వైఫల్యాలను ఇతర పార్టీల మీద వేస్తున్నాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖపట్టణంలోని దక్షిణ నియోజకవర్గంలో సంఘీభావ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో పాల్గొన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా తాకట్టుపెట్టిన చంద్రబాబు తన స్వలాభం కోసం ప్యాకేజ్ కు ఒప్పుకున్నారని ఆరోపించారు.

ఇటువంటి వ్యక్తి, ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. బీజేపీతో వైసీపీ జతకట్టిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ పార్టీతో వైసీపీ జతకట్టని విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధే స్వయంగా స్పష్టం చేసిన విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ప్రత్యేకహోదా ఎవరు ఇస్తారో వారితో తాము కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
Chandrababu
YSRCP
Vijay Sai Reddy

More Telugu News