Pawan Kalyan: సొంత జిల్లా ప్రజలకు చంద్రబాబు ఎందుకు న్యాయం చేయట్లేదు?: పవన్‌ కల్యాణ్‌

  • భూనిర్వాసితులకు న్యాయం చేయాల్సిందే 
  • ఓ వైపు విదేశాల నుంచి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తున్నారు
  • నంద్యాలలో ఇచ్చిన నష్ట పరిహారం ఇక్కడ ఎందుకు ఇవ్వరు?
శ్రీకాళహస్తిలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అక్కడి ఆలయాలను దర్శించుకున్న తరువాత చిత్తూరులోని హై రోడ్ వెల్పేర్‌ ఆప్షన్‌ బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తన సొంత జిల్లాలోని ప్రజలకు న్యాయం చేయలేదని, ఇక మిగిలిన జిల్లాల ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. భూనిర్వాసితులకు న్యాయం చేయాల్సిందేనని ఉద్ఘాటించారు.

ఓ వైపు విదేశాల నుంచి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తూ సొంత జిల్లా వాసులకు న్యాయం ఎందుకు చేయరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అలాగే, విజయనగరం, శ్రీకాళహస్తి, నంద్యాలలో ఇచ్చిన నష్ట పరిహారం చిత్తూరులో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు.
Pawan Kalyan
Chandrababu
BJP
Jana Sena

More Telugu News