devegouda: దేవెగౌడ వద్దకు చేరుకుని కీలక చర్చలు జరుపుతోన్న కుమారస్వామి

  • ఇటీవల సింగపూర్‌ వెళ్లిన కుమారస్వామి
  • ప్రస్తుతం బెంగళూరు పద్మనాభనగర్‌లో జేడీఎస్‌ అగ్రనేతలు
  • దేవెగౌడ నివాసంలోనే కాంగ్రెస్‌ నేత సీకే జాఫర్‌ షరీఫ్‌
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేడీఎస్‌తో కాంగ్రెస్‌ పార్టీ చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇటీవల సింగపూర్‌ వెళ్లిన జేడీఎస్‌ నేత కుమారస్వామి తాజాగా బెంగళూరు పద్మనాభనగర్‌లో తన తండ్రి దేవెగౌడతో భేటీ అయ్యారు. మరోవైపు, దేవెగౌడ నివాసానికి జేడీఎస్‌ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దేవెగౌడ నివాసానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సీకే జాఫర్‌ షరీఫ్‌ కూడా వెళ్లారు. ఈ రోజు సాయంత్రం కుమారస్వామి కాంగ్రెస్ నేతలతో కలిసి గవర్నర్‌ వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.            
devegouda
Karnataka
kumara swamy

More Telugu News