jds: కాంగ్రెస్‌ ప్రతిపాదనను అంగీకరించాం.. మా సీఎం అభ్యర్థి ఎప్పటికీ కుమారస్వామే: తొలిసారి స్పందించిన జేడీఎస్‌

  • బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమే మా ఉద్దేశం
  • మాకు పూర్తి స్థాయిలో మద్దతు 
  • సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్‌ను కలుస్తాం
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్‌కు మద్దతిస్తామని, ఇప్పటికే ఆ పార్టీ నేతలలో చర్చించామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తొలిసారి జేడీఎస్‌ స్పందించింది. ఆ పార్టీ నేత డానిష్‌ అలీ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ప్రతిపాదనకు తాము అంగీకరించామని ప్రకటించారు.

జేడీఎస్‌ తరఫున ఎప్పటికీ సీఎం అభ్యర్థి కుమారస్వామేనని వ్యాఖ్యానించారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమే తమ ఉద్దేశమని, తమకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ఒప్పుకుందని అన్నారు. ఇరు పార్టీల నేతలు కలిసి ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్‌ను కలుస్తారని తెలిపారు.
jds
siddaramiah
Karnataka

More Telugu News