Pawan Kalyan: శ్రీకాళహస్తి ఆలయంలో పవన్ కల్యాణ్.. 'సీఎం' అంటూ అభిమానుల నినాదాలు!

  • శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
  • పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు
  • వవన్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ నినాదాలు
తిరుమలలో రెండు రోజులు బస చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడి నుంచి ఈ రోజు శ్రీకాళహస్తికి వెళ్లారు. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్వదర్శన క్యూలైన్ లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

పవన్ కల్యాణ్ రాకతో ఆలయం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అభిమానులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 'పవన్ కల్యాణ్ సీఎం' అంటూ ఆలయం ప్రాంగణంలో నినాదాలు చేశారు. శ్రీకాళహస్తిలో స్వామివారి దర్శనానంతరం పవన్ కల్యాణ్ గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామిని, వికృతమాలలోని శ్రీసంతాన వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
Pawan Kalyan
srikalahasthi
Jana Sena

More Telugu News