laxman: చంద్రబాబు, కేసీఆర్‌లకి చెంపపెట్టులాంటి తీర్పు: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌

  • కర్ణాటకలో బీజేపీ ఓటమి కోసం వారు ప్రయత్నించారు
  • కన్నడ ప్రజలు మోదీ అభివృద్ధి విధానాలకు జై కొట్టారు
  • అమిత్‌ షా, యడ్యూరప్ప కృషి గెలుపునకు కారణమైంది
బీజేపీని గెలిపిస్తూ కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లకు చెంపపెట్టులాంటిదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. జేడీఎస్‌కి కేసీఆర్‌ మద్దతు తెలిపారని, కాంగ్రెస్‌కి అనుకూలంగా చంద్రబాబు వ్యవహరించారని వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో బీజేపీ ఆధిక్యం సాధిస్తోన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటక ప్రజలు మోదీ చేస్తోన్న అభివృద్ధికి మద్దతు తెలిపారని అన్నారు. ఒకవైపు బీజేపీ గెలుపునకు మోదీ విధానాలు అభివృద్ధి పథకాలు తోడ్పాటునందిస్తే మరోవైపు భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సంస్థాగతంగా బూత్‌ స్థాయి నుంచి కార్యకర్తలను ఉత్సాహపరిచి విజయాన్ని అందించారని అన్నారు.

మోదీ, అమిత్‌ షాతో పాటు యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చిందని లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీకి దక్షిణ భారత్‌లో ప్రాభవం లేదంటోన్న వారు ఇకపై కళ్లు తెరుచుకుంటారని చెప్పుకొచ్చారు.
laxman
Telugudesam
BJP
Karnataka

More Telugu News