galla jayadev: కాంగ్రెస్ ఉన్న చోట ప్రత్యామ్నాయం బీజేపీయేనని తెలుస్తోంది: గల్లా జయదేవ్

  • కర్ణాటక ఫలితాలు మరోసారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి
  • తెలుగు వారి ఓట్ల ప్రభావం ఎలా ఉందన్నది ఆసక్తికరం
  • ఫేస్ బుక్ లో గల్లా జయదేవ్ పోస్ట్
కర్ణాటక రాష్ట్ర ప్రజల్లో మెజారిటీ బీజేపీ పక్షాన నిలిచినట్టు ఎన్నికల ఫలితాల సరళి తెలుస్తుండడంతో టీడీపీ ముఖ్య నేత, లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ స్పందించారు. ఫేస్ బుక్ లో తన స్పందనను పోస్ట్ రూపంలో తెలియజేశారు.

‘‘కాంగ్రెస్ ఉన్న చోట ఏకైక ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరిస్తున్నట్టు మరోసారి కర్ణాటక ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఓల్డ్ మైసూరు ఫలితాలను మరింత నిశితంగా పరిశీలించాల్సి ఉంది. అక్కడ జేడీఎస్ ప్రభావంతో మూడు పక్షాల మధ్య పోటీ నెలకొని ఉంది. తెలుగు వారి ఓట్ల ప్రభావం ఎలా ఉందన్నదానిపై ఆసక్తి నెలకొంది’’ అంటూ గల్లా జయదేవ్ తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు.
galla jayadev
Karnataka elections

More Telugu News