కాసేపట్లో హైదరాబాదులో బీజేపీ విజయోత్సవ ర్యాలీ
- కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ
- ఏపీ, టీఎస్ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం
- మధ్యాహ్నం హైదరాబాదులో బీజేపీ ర్యాలీ
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, కర్ణాటక ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఆనందకరమని చెప్పారు. యావత్ దేశం నరేంద్ర మోదీ పాలనను కోరుకుంటోందని... అందుకే ప్రతి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతోందని అన్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాదులో విజయోత్సవ ర్యాలీని నిర్వహించనున్నామని... ర్యాలీలో అందరూ పాల్గొనాలని కోరారు.