జేడీఎస్ తో మంతనాలు ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు ఆజాద్, గెహ్లాట్!
- హంగ్ దిశగా ఫలితాలు
- జేడీఎస్ కు డిప్యూటీ సీఎం పదవి
- చర్చలు మొదలు పెట్టిన కాంగ్రెస్ నేతలు
ఇప్పటికే హంగ్ తప్పదని తేలడంతో జేడీఎస్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకుంటే, జేడీఎస్ ను ఎన్డీయేలో చేర్చుకుని ఆ పార్టీ నేత కుమారస్వామిని సీఎం చేసేందుకు తమకు అభ్యంతరం లేదని బీజేపీ సైతం సంకేతాలు పంపింది. ఏదిఏమైనా, కన్నడనాట రాజకీయం రసవత్తరంగా మారుతోంది.