BJP: నేను ఓడిపోతున్నా.. బీజేపీ అభ్యర్థి యోగీశ్వర సంచలన వ్యాఖ్యలు

  • నా ఓటమి కోసం కాంగ్రెస్-జేడీఎస్ కుట్ర
  • కుమారస్వామిని గెలిపిస్తున్న కాంగ్రెస్
  • రెండు స్థానాల్లోనూ సిద్ధరామయ్య వెనుకంజ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యిందో లేదో.. బీజేపీ చెన్నపట్టణ నియోజకవర్గ అభ్యర్థి యోగీశ్వర సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోబోతున్నానని పేర్కొన్నారు. తనను ఓడించేందుకు కాంగ్రెస్-జేడీఎస్ కుట్ర పన్నాయని ఆరోపించారు. జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామిని కాంగ్రెస్ కావాలనే గెలిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బ్లాక్ మనీని కాంగ్రెస్ విపరీతంగా వెదజల్లిందన్నారు.

ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరాయమ్య తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వెల్లడైన సరళిని బట్టి బీజేపీ 59, కాంగ్రెస్ 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, జేడీఎస్ అభ్యర్థులు 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 
BJP
Karnataka
Yogiswara
Elections

More Telugu News