వెన్ను నొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి
- 2009లో షూటింగ్‌లో గాయపడిన మిథున్
- ఏడాది కాలంగా బాలీవుడ్‌కు దూరంగా ఊటీలో
- వెన్ను నొప్పి తిరగబెట్టడంతో తిరిగి ఆసుపత్రిలో చేరిక
2009లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నుకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత చికిత్సతో సమస్య కొంత తగ్గినా తాజాగా మరోమారు వెన్ను నొప్పి వేధించడంతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. మిథున్ చక్రవర్తి తెలుగులోనూ నటించారు. పవన్ కల్యాణ్, వెంకటేశ్ కాంబినేషన్లో వచ్చిన మల్టీ స్టారర్ ‘గోపాల గోపాల’ సినిమాలో మిథున్ స్వామీజీ పాత్ర పోషించారు. లీలాధర స్వామిగా ఆయన నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.