central cabnet: కేంద్ర మంత్రి వర్గంలో స్వల్ప మార్పులు!

  • కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి స్మృతీకి స్వస్తి
  • ఆ శాఖ బాధ్యతలు చూడనున్న రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
  • జైట్లీ కోలుకునే వరకు పీయూష్ గోయల్ కు అదనపు బాధ్యతలు
  • ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖా మంత్రి  ఆల్ఫోన్స్ థానమ్ కు ఉద్వాసన
కేంద్ర మంత్రి వర్గంలో స్వల్ప మార్పులు చోటుచేకున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యతల నుంచి స్మృతీ ఇరానీని తప్పించారు. ఆ శాఖ బాధ్యతలను రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కు అప్పగించారు. అయితే, స్మృతీ ఇరానీ జౌళి శాఖకు కూడా మంత్రిగా ఉన్నారు. ఆ శాఖకు మాత్రమే ఆమె మంత్రిగా కొనసాగనున్నారు.

కాగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు కిడ్నీమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకునే వరకు ఆ శాఖ వ్యవహారాలను చూడాలంటూ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ఆల్ఫోన్స్ థానమ్ ను తప్పించారు. ఎలక్ట్రానిక్స్ శాఖ బాధ్యతలను ఎస్ఎస్ అహ్లూవాలియాకు అప్పగించారు.
central cabnet

More Telugu News