srikalahasthi: రేపు శ్రీకాళహస్తిలోని ఆలయాలకు పవన్‌ కల్యాణ్

  • ఈ రోజు కూడా తిరుపతిలోనే పవన్‌
  • ముగియనున్న మూడు రోజుల ప్రకటన
  • త్వరలో చిత్తూరులోనూ పర్యటన
ముందుగా ఎటువంటి ప్రకటనా చేయకుండా తిరుపతి వెళ్లిన జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అక్కడ తన మూడు రోజుల పర్యటనను.. ఈ రోజు తిరుపతిలోనే నిద్రచేసి ముగించుకోనున్నారు. ఇక రేపు ఉదయం తిరుమల నుంచి శ్రీకాళహస్తి వెళ్లి వాయులింగేశ్వర, గుడిమల్లం పరశురామ ఆలయాలను, వికృతమాల వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. శ్రీకాళహస్తిలో సందర్శనలు ముగిసిన తరువాత చిత్తూరులో పర్యటించి, హైరోడ్డు నిర్వాసితులను పరామర్శించనున్నారు. అనంతరం బస్సు యాత్ర చేసే అవకాశంపై పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.         
srikalahasthi
Pawan Kalyan
Jana Sena

More Telugu News