Andhra Pradesh: పిడుగుపాటుకు క్రికెట్ ఆడుతున్న ముగ్గురు చిన్నారులు మృతి!

  • గుంటూరు జిల్లా సమాధానంపేటలో విషాద సంఘటన
  • గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుండగా వర్షంతో పాటు పిడుగులు
  • సురక్షిత ప్రదేశానికి వెళదామనుకునే లోపే పిడుగుపడ్డ వైనం
గుంటూరు జిల్లా గురజాల మండలంలోని సమాధానంపేటలో ప్రకృతి వైపరీత్యానికి ముగ్గురు బాలురు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో గ్రౌండ్ లో పవన్ నాయక్, హరిబాబు, మనోహర్ నాయక్ క్రికెట్ ఆడుకుంటున్నారు. అదే సమయంలో వర్షం కురవడంతో పాటు పిడుగులు పడ్డాయి. అక్కడి నుంచి ముగ్గురు బాలురు సురక్షిత ప్రదేశానికి వెళదామనుకునేలోపే పిడుగు పడటంతో అక్కడికక్కడే వారు ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 
Andhra Pradesh
gurajala

More Telugu News