business: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు!

  • రేపు వెలువడనున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు 
  • అప్రమత్తంగా వ్యవహరించిన మదుపర్లు
  • లాభపడ్డ భారత్ పెట్రోలియం,ఎన్టీపీసీ తదితర సంస్థల షేర్లు  
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో, ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈరోజు మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 21 పాయింట్ల లాభంతో 35,557 పాయింట్ల వద్ద, నిఫ్టీ క్రితం సెషన్ తో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండా 10,807 పాయింట్ల వద్ద ముగిశాయి.

కాగా, భారత్ పెట్రోలియం, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డాక్టర్ రెడ్డీస్ సంస్థల షేర్లు లాభపడగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఇన్ ఫ్రాటెల్, జీ ఎంటర్ టైన్ మెంట్స్, టైటాన్ సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
business
sensex
nifty

More Telugu News