Chandrababu: హోదా బదులు ప్యాకేజ్ ఇచ్చినా చంద్రబాబు సాధించుకోలేకపోయారు: కన్నా లక్ష్మీనారాయణ

  • ఢిల్లీలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న కన్నా
  • చంద్రబాబు అవినీతికి పాల్పడకపోతే భయపడటమెందుకు?
  • వైసీపీ, ‘జనసేన’లతో బీజేపీ జతకడుతుందనేది తప్పుడు ప్రచారం
  • ఎన్నికల్లో పొత్తులపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై బీజేపీ కొత్త అధ్యక్షుడి హోదాలో కన్నా లక్ష్మీనారాయణ తొలిసారి విరుచుకుపడ్డారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ ఇచ్చినా చంద్రబాబు సాధించుకోలేకపోయారని విమర్శించారు.

చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడకపోతే భయపడటం ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ, జనసేన పార్టీలతో బీజేపీ జతకడుతుందని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై  పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని, బీజేపీ విజయం కోసం పాటుపడతానని, అందరినీ కలుపుకునిపోతానని చెప్పారు. 
Chandrababu
kanna laxmi narayana

More Telugu News