aiims: అరుణ్‌జైట్లీకి మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్.. ఆరోగ్యంగా ఉన్నారన్న ఎయిమ్స్‌ వైద్యులు

  • అరుణ్‌జైట్లీకి మూత్రపిండాల సమస్య
  • శస్త్రచికిత్స విజయవంతం
  • త్వరగా కోలుకున్న జైట్లీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ మూత్రపిండాల సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. వైద్యుల సూచనలతో ఆయన ఇంటివద్ద నుంచే ముఖ్యమైన పనులు పూర్తి చేస్తున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావటంతో ఆయనకు తాజాగా ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేశారు. తాజాగా, వైద్యులు మీడియాకు వివరాలు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, అరుణ్‌జైట్లీ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరగా కోలుకున్నారని చెప్పారు. కాగా, కొన్ని రోజులుగా అరుణ్‌జైట్లీ ఏ అధికారిక కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.
aiims
Arun Jaitly
New Delhi

More Telugu News