airtel: రూ.149కే రోజుకి 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌.. ఎయిర్‌టెల్‌ ఆఫర్‌

షార్ట్స్‌లో చూడండి
టెలికాం మార్కెట్‌లో రిలయన్స్‌ జియో ఇస్తోన్న పోటీని ఎదుర్కునేందుకు భారతి ఎయిర్‌టెల్‌ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. జియోలో రూ.149తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా, ఉచిత కాల్స్‌ లభిస్తుండగా అందుకు దీటుగా ఎయిర్‌టెల్‌ కూడా రూ.149 ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రీ పెయిడ్‌ ప్లాన్‌లో రోజుకు 1 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు 28 రోజుల పాటు అందుకోవచ్చు. మార్కెట్లో జియో ఇస్తోన్న పోటీతో అన్ని టెలికాం కంపెనీలు డేటా ధరలు తగ్గిస్తూ వస్తున్నాయి.                                           
Go Back to Shorts
airtel
jio
offer

More Telugu News