Pawan Kalyan: పవర్ స్టార్ ఎనర్జీ ఇదేనన్న వర్మ... 'కెలకమాకు సామీ' అంటూ రామజోగయ్య శాస్త్రి కౌంటర్!

  • తిరుమలకు నడిచి వెళ్లిన పవన్
  • మధ్యలో అలసి సేదదీరిన జనసేనాని
  • ఆ ఫొటో పెడుతూ పవన్ ఎనర్జీకి ఉదాహరణన్న వర్మ
  • కౌంటర్ వేసిన రామజోగయ్య శాస్త్రి
నిన్న పవన్ కల్యాణ్, రవితేజలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆపై తిరుమలకు కాలినడకన వెళుతూ, మధ్యలో అలసిపోయి కాసేపు సేదదీరుతున్న పవన్ కల్యాణ్ ఫొటోలు పోస్టు చేస్తూ, "పవర్ స్టార్ పవర్ ఫుల్ ఎనర్జీకి ఇది పవర్ ఫుల్ ఎగ్జాంపుల్" అని వ్యాఖ్యానించి మరిన్ని విమర్శలు కొని తెచ్చుకున్నారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతుంటే, ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ ఖాతాలో వర్మకు కౌంటర్ ఇచ్చారు. "కెలకమాకు సామీ. కాస్త వాతావరణం మర్చిపోతే ఆ పని అందరూ చేయగలరు. ఇది మీకు హుందా అయినది కాదు. తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు. ఏమన్నా ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోండి" అని వ్యాఖ్యానించారు. రామజోగయ్య శాస్త్రి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Pawan Kalyan
Twitter
Ramgopal Varma
Ramajogaiah Sastry
Tirumala

More Telugu News