Pawan Kalyan: తిరుమలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో పూర్తిగా ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్నారు. గోగర్భం జలాశయం సమీపంలో ఉన్న హంపీ మఠంలో బసచేసిన ఆయన స్వామివారి దర్శనానంతరం తన గదిలో ఏకాంతంగా గడుపుతున్నారు. ఎవరినీ తన గది వద్దకు కూడా రానీయడం లేరు. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయంలోకి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను చూడటానికి మాడవీధుల్లోకి అభిమానులు చొచ్చుకొచ్చారు.

ఈ సందర్భంగా పవన్ ను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి, పలు ప్రశ్నలు వేసే ప్రయత్నం చేశారు. అయితే, సమాధానాలు చెప్పడానికి ఆయన నిరాకరించారు. దేవుడి సన్నిధిలో కేవలం ఆధ్యాత్మిక విషయాలను మాత్రమే మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు. ఇతర విషయాలను మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు అంటూ సున్నితంగా బదులిచ్చారు. ఈ సందర్భంగా, ఆయన తన జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన ఘటనను తెలిపారు. తిరుమలతో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన అన్నారు. కొండపై ఉన్న యోగనరసింహస్వామి ఆలయం వద్ద తనకు నామకరణం, అన్నప్రాసన చేశారని చెప్పారు. ఈ రోజు కూడా ఆయన తిరుమలలోనే ఉండి, రేపు తిరుగుపయనం కానున్నారు. 
Go Back to Shorts
Pawan Kalyan
tirumala

More Telugu News