హైదరాబాద్‌లో పెచ్చుమీరుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు!
- నిబంధనలు, జరిమానాలకు వెరవని వాహనదారులు
- రెచ్చిపోతున్న ‘ఉల్లంఘనులు’
- వేలల్లో కేసులు నమోదు
- క్రమశిక్షణ లేమే కారణమంటున్న నిపుణులు
వాహనదారుల్లో క్రమశిక్షణ లేమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొన్నారు. పెనాల్టీ పాయింట్ సిస్టం అమల్లోకి వచ్చినా ట్రాఫిక్ ఉల్లంఘనలు మాత్రం ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. చాలా కేసుల్లో పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదని రోడ్ సేఫ్టీ నిపుణులు చెబుతున్నారు.