Telangana: వడదెబ్బకు గురైన అశ్వారావుపేట ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు.. పరామర్శలు!

  • అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే
  • పరామర్శించిన పాయం వెంకటేశ్వర్లు
  • ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
శనివారం వడదెబ్బకు గురై భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. ఆదివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆయనను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ఆసుపత్రికి చేరుకుని వెంకటేశ్వర్లును పరామర్శించారు.
Telangana
MLA
Thati venkateswarlu

More Telugu News