జీవితా రాజశేఖర్, బాబు గోగినేని, పవన్ ఫ్యాన్స్‌పై సినీ నటి శ్రీరెడ్డి ఫిర్యాదు
- మొత్తం 28 మందిపై పోలీసులకు ఫిర్యాదు
- సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం కొనసాగుతోందన్న నటి
- సైబర్ క్రైం సహకారంతో కేసు నమోదు చేస్తామన్న ఏసీపీ
ఫేస్బుక్లో తనపై దుష్ర్పచారం ఆగలేదని, కొందరు కావాలని, పనికట్టుకుని తనపై ఇటువంటి ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఆదివారం హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆసిఫ్‌నగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తికి ఈ మేరకు వినతి పత్రం అందించింది. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. సైబర్ క్రైం సహకారంతో ఫిర్యాదులోని అంశాలపై వివరాలు సేకరించి, న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని శ్రీరెడ్డికి ఏసీపీ హామీ ఇచ్చారు.