Tollywood: అమ్మ ఆశీస్సులు పొందిన ‘మెగా’ బ్రదర్స్!

  • అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, నాగబాబు
  • శాలువాలు కప్పి పుష్పగుచ్ఛం అందజేత
  • ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్
ఈరోజు మదర్స్ డే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి, సోదరుడు నాగబాబు తమ తల్లి ఆశీస్సులు పొందారు. ‘మెగా’ బ్రదర్స్ తో పాటు ఇద్దరు సోదరీమణులు తమ తల్లి అంజనాదేవికి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ‘మెగా’ బ్రదర్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తిరుమలలో ఉన్న విషయం తెలిసిందే.  
Tollywood
mega brothers
mothers day

More Telugu News