Tollywood: మదర్స్ డే సందర్భంగా స్పెషల్ షార్ట్ ఫిల్మ్ ఇది!: హీరో నాగశౌర్య

  • నాగశౌర్య దర్శకత్వంలో రూపొందించిన ‘భూమి’ 
  • భూమిని కాపాడేందుకు ప్రతి ఇంటికీ ఒక్క చెట్టు నాటమన్నారు
  • మరి, తల్లి లాంటి ఆడవాళ్లను కాపాడుకోవడానికి ఏ చెట్టు నాటాలి?
ఈరోజు మదర్స్ డే సందర్భంగా స్పెషల్ షార్ట్ ఫిల్మ్ ను ప్రముఖ హీరో నాగశౌర్య విడుదల చేశారు. ఆయన దర్శకత్వంలోనే రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్  పేరు ‘భూమి’. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి సందేశం ఇచ్చాడు.

‘భూమి.. భూమి లాంటిదే తల్లి కూడా. ఎంత కష్టమైనా భరిస్తుంది. ఎంత బరువైనా మోస్తుంది. కొన్ని మదమెక్కిన మగ జంతువులు ఆడవారి మీద వాటి పైశాచిక బలాన్ని చూపిస్తున్నాయి .. భూమిని కాపాడుకోవడానికి ప్రతి ఇంటికి ఒక్క చెట్టు నాటమన్నారు. మరి, తల్లి లాంటి ఆడవాళ్లను కాపాడుకోవడానికి ఏ చెట్టు నాటాలి?’ అని నాగశౌర్య ప్రశ్నించారు.
Tollywood
naga sourya
bhoomi short film

More Telugu News