YSRCP: రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనున్న వైఎస్ జగన్!

  • పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన జగన్ పాదయాత్ర
  • ఈ జిల్లాలో 250 కిలోమీటర్ల మేర కొనసాగనున్న పాదయాత్ర 
  • రేపు ఏలూరులో ఈ మైలురాయిని దాటనున్న జగన్
వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఈరోజు ప్రవేశించింది. ఈరోజు మధ్యాహ్నం కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి ఏలూరు మండలంలోకి ప్రవేశించే పెదయెడ్లగాడి వంతెన మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు జగన్ కు ఘనస్వాగతం పలికారు.

అక్కడి నుంచి కలకుర్రు, మహేశ్వరపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర కొనసాగనుంది. కాగా, జగన్ తన పాదయాత్రలో రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు. రేపు ఏలూరులో పర్యటించనున్న జగన్ ఈ మైలురాయిని దాటనున్నారు. ఈ సందర్భంగా ఏలూరు మండలంలోని వెంకటాపురం దగ్గర నిర్మించిన 40 అడుగుల పైలాన్ ను జగన్ ఆవిష్కరించనున్నారు.
YSRCP
Jagan

More Telugu News