జగన్ కు దేవుడు అమిత్ షా... ఆయన స్విచ్ వేశారు, ఈయన కదిలారు: దేవినేని ఉమ
- శాంతియుత నిరసనను రాళ్లదాడిగా చెబుతున్నారు
- జగన్ చేసేది మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్
- కన్నడనాట డబ్బు పంచిన విజయసాయి
- ఆరోపించిన దేవినేని ఉమ
తిరుపతిలో అమిత్ షా స్విచ్ వేస్తే, జగన్ దగ్గర లైటు వెలిగిందని ఎద్దేవా చేశారు. కన్నడనాట ఎన్నికల్లో బీజేపీ కోసం విజయసాయిరెడ్డి స్వయంగా డబ్బులు పంచారని, అధికారం కోసం జగన్ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు నీరందించేందుకు వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను నిర్మిస్తుంటే, వైకాపా అడ్డుకుంటోందని, పోలవరం కుడికాలువలో వెళుతున్న నీటిని నెత్తిపై చల్లుకుంటే జగన్ లోని దుర్మార్గపు ఆలోచనలు మాయమవుతాయని అన్నారు. గత రాత్రి బెంజ్ సర్కిల్ లో తొలగించిన కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తిరిగి అదే ప్రాంతంలో ప్రతిష్ఠిస్తామని తెలిపారు.