Devineni Uma: జగన్ కు దేవుడు అమిత్ షా... ఆయన స్విచ్ వేశారు, ఈయన కదిలారు: దేవినేని ఉమ

  • శాంతియుత నిరసనను రాళ్లదాడిగా చెబుతున్నారు
  • జగన్ చేసేది మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్
  • కన్నడనాట డబ్బు పంచిన విజయసాయి
  • ఆరోపించిన దేవినేని ఉమ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే, రాళ్లదాడి చేశారని వైఎస్ జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రతి రోజూ మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్ చేస్తున్న జగన్ కు అమిత్ షా దేవుడిలా కనిపిస్తున్నారని, అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు రాక్షసుడిలా కనిపిస్తున్నారని విమర్శించారు.

తిరుపతిలో అమిత్ షా స్విచ్ వేస్తే, జగన్ దగ్గర లైటు వెలిగిందని ఎద్దేవా చేశారు. కన్నడనాట ఎన్నికల్లో బీజేపీ కోసం విజయసాయిరెడ్డి స్వయంగా డబ్బులు పంచారని, అధికారం కోసం జగన్ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు నీరందించేందుకు వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను నిర్మిస్తుంటే, వైకాపా అడ్డుకుంటోందని, పోలవరం కుడికాలువలో వెళుతున్న నీటిని నెత్తిపై చల్లుకుంటే జగన్ లోని దుర్మార్గపు ఆలోచనలు మాయమవుతాయని అన్నారు. గత రాత్రి బెంజ్ సర్కిల్ లో తొలగించిన కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తిరిగి అదే ప్రాంతంలో ప్రతిష్ఠిస్తామని తెలిపారు.
Devineni Uma
Jagan
Chandrababu
Amit sha

More Telugu News