తల్లిదండ్రులను వేధిస్తే ఇకపై ఆరు నెలల జైలు శిక్ష... చట్టాన్ని సవరించనున్న కేంద్రం
- తల్లిదండ్రుల సంక్షేమాన్ని పట్టించుకోకపోతే జైలుకే
- ప్రస్తుతం మూడు నెలల జైలు శిక్ష
- దీన్ని ఆరు నెలలకు పెంచుతూ చట్టంలో సవరణ ప్రతిపాదన
అలాగే, పెద్దలకు జీవన వ్యయం చెల్లించని సంతానానికి నెల వరకు జైలు శిక్ష విధించే అధికారాన్ని ట్రైబ్యునళ్లకు కల్పించాలనుకుంటోంది. ఈ మేరకు సవరణలను సీనియర్ సిటిజన్స్ యాక్ట్, 2007కు కేంద్రం ప్రతిపాదించింది. ఈ ముసాయిదా బిల్లుపై అభిప్రాయలు, సూచనలను తెలియజేయాలని కోరుతూ కేంద్ర సామాజిక న్యాయ శాఖ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది.