Mothers Day: ఈ స్థాయిలో నేనుండటానికి కారణం అమ్మే: వైఎస్ జగన్
- నేడు మదర్స్ డే
- విజయమ్మకు అభినందనలు తెలిపిన జగన్
- ట్విట్టర్ ప్రత్యేక ట్వీట్
నేడు మాతృ దినోత్సవం కావడంతో ట్విట్టర్ వేదికగా, వైకాపా అధినేత వైఎస్ జగన్, తన తల్లి విజయమ్మకు అభినందనలు తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ఆమే కారణమని వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం లేదని చెప్పారు. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, తన పాదయాత్ర 160వ రోజును కైకలూరు శివారు ప్రాంతం నుంచి ప్రారంభించిన ఆయన, నేటి రాత్రి మహేశ్వర పురంలో బస చేయనున్నారు. జగన్ పాదయాత్ర కీలకమైన 2000 కిలోమీటర్ల మైలురాయిని రెండు, మూడు రోజుల్లో తాకనుంది.
కాగా, తన పాదయాత్ర 160వ రోజును కైకలూరు శివారు ప్రాంతం నుంచి ప్రారంభించిన ఆయన, నేటి రాత్రి మహేశ్వర పురంలో బస చేయనున్నారు. జగన్ పాదయాత్ర కీలకమైన 2000 కిలోమీటర్ల మైలురాయిని రెండు, మూడు రోజుల్లో తాకనుంది.