Kireeti Damaraju: హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్... పట్టుబడ్డ 'ఉయ్యాలా జంపాలా' ఫేమ్ కిరీటి దామరాజు!

  • కిరీటి దామరాజు బ్లడ్ ఆల్కహాల్ లెవల్ 36
  • వాహనం స్వాధీనం, కేసు నమోదు
  • కౌన్సెలింగ్ తరువాత కోర్టులో హజరు పరుస్తామన్న పోలీసులు
గత రాత్రి హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, సినీ నటుడు కిరీటి దామరాజు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో కిరీటి నడుపుకుంటూ వస్తున్న కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయగా ఆయన బ్లడ్ ఆల్కహాల్ లెవల్ 36గా నమోదైంది. దీంతో ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు బుక్ చేశారు.

 కాగా, కిరీటి దామరాజు ఉయ్యాలా జంపాలా, సెకండ్ హ్యాండ్, మీకు మీరే మాకు మేమే, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, చల్ మోహన రంగా.. తదితర చిత్రాల్లో నటించాడు. ఈ తనిఖీల్లో మొత్తం 20 వాహనదారులపై కేసులు బుక్ చేశామని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఆపై కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 
Kireeti Damaraju
Uyyala Jampala
Drunk Driving

More Telugu News